14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
Thu May 29, 2025 12:57 Entertainment
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్ఎసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా 'పుష్ప 2' చిత్రానికి గానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో రెండు సినిమాలకు అవార్డులు లభించాయి. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత అవార్డులు ఇచ్చారు. జూన్ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..
2024 బెస్ట్ ఫిల్మ్స్ ఇవే..
మొదటి ఉత్తమ ఫీచర్ చిత్రం: కల్కి 2898 ఏడీ
రెండో ఉత్తమ ఫీచర్ చిత్రం: పొట్టేల్
మూడో ఉత్తమ ఫీచర్ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్
ఉత్తమ పరిచయ దర్శకుడు: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు..
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్ సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2-సూసేకి అగ్గిరవ్వ)
ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సినిమాటోగ్రఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
నటుడు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
నటి అనన్య నాగళ్ల (పొట్టేల్)
దర్శకులు సుజీత్, సందీప్ (క)
నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజు యాదవ్)
స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: 'మన సినిమా ఫస్ట్ రీల్' (రెంటాల జయదేవ్)
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Hyderabad #RevaParty #Polices
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.